Gossips Telugu


మిర్చి సిటీలో ఎన్టీఆర్ మోత





నిన్న మధ్యాహ్నం ‘టెంపర్’ సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ లుక్స్ లీకైనప్పటి నుంచి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లలో, వెబ్ మీడియాలో, టీవీ ఛానెళ్లలో రచ్చ రచ్చే. ఎన్టీఆర్‌ను చిజిల్డ్ బాడీలో చూసిన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. వాళ్ల ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ వర్మ చేసిన ట్వీట్లు ఇంకా కిక్కు పుట్టించాయి. ఈ రోజు ఉదయం టెంపర్ లోగోను కూడా చూపించేశారు. సాయంత్రానికి ఫస్ట్ లుక్, టీజర్ కూడా రిలీజైపోతాయని సమాచారం. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా ఉంది. ఇంతలో ‘టెంపర్’కు సంబంధించిన ఇంకో అప్‌డేట్ బయటికొచ్చింది.

టెంపర్ ఆడియో రిలీజ్ ముందుగా అనుకున్నట్లుగానే డిసెంబరు 14న జరగనుంది. ఐతే దీనికి వేదిక సీనియర్ ఎన్టీఆర్ జన్మస్థలం నిమ్మకూరు అని, ఆంధ్రావాలా సెంటిమెంటును రిపీట్ చేయబోతున్నారని ప్రచారం జరిగింది కానీ.. అది వాస్తవం కాదని తేలింది. టెంపర్ ఆడియోను మిర్చీ సిటీ గుంటూరులో రిలీజ్ చేయబోతున్నారట. ఇందుకోసం బ్లాక్‌బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ తనదైన శైలిలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారట. పెద్ద మైదానంలో భారీ వేదిక నిర్మించి ఆడియో ఫంక్షన్ చేస్తారట. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అతను ఎన్టీఆర్‌తో పని చేయడం ఇదే తొలిసారి.



ఎన్టీఆర్‌తో సినిమా చేసే అర్హత నాకు లేదు-వర్మ




పవన్ కళ్యాణ్ అయిపోయాడు.. ఇప్పుడు ఎన్టీఆర్ మీద పడ్డాడు రామ్ గోపాల్ వర్మ. అత్తారింటికి దారేది సినిమా విడుదల సమయంలో, పవన్ రాజకీయ అరంగేట్రం చేసి సమయంలో అతను కూడా సిగ్గుపడిపోయేలా తెగ పొగిడేసిన వర్మ.. ఇప్పుడు ఎన్టీఆర్‌పై తన పొగడ్తలతో రెచ్చిపోయాడు. తన శిష్యుడు పూరి జగన్నాథ్ ఎన్టీఆర్‌తో తీసిన ‘టెంపర్’ రషెస్ చూసిన వర్మ.. ఎన్టీఆర్‌ను, పూరిని ఎలా పొగిడాడో ఓసారి అతడి ట్వీట్లను చూస్తే అర్థమవుతుంది..

‘‘టెంపర్‌లో కొన్ని సన్నివేశాలు చూశా. తారక్ అద్భుతంగా చేశాడు. జగన్ క్రియేట్ చేసిన బెస్ట్ క్యారెక్టర్ ఇదే అనుకుంటున్నా’’
‘‘జగన్ తీసిన బెస్ట్ కమర్షియల్ మూవీ టెంపర్ అని చెప్పాలి. ఇందులో పాటలు, సన్నివేశాలు, ఎంటర్టైన్మెంట్ ఆ స్థాయిలో ఉన్నాయి. అన్నిటికంటే మిన్నగా ఇందులో తారక్ ఉన్నాడు’’
‘‘తారక్ ’టెంపర్‌’తో పోలిస్తే పోకిరి, బిజినెస్‌మేన్ ఫ్లాపుల్లా కనిపిస్తున్నాయి’’
‘‘టెంపర్ తర్వాత జగన్‌ను జ‘గన్’ అనాలి. తారక్‌ను బుల్లెట్ అనాలి’’
‘‘టెంపర్‌లో తారక్.. జ‘గన్’ నుంచి ఫైర్ అయిన బుల్లెట్‌లా ఉన్నాడు. ఈ బుల్లెట్ యాంటి ఎయిర్‌క్రాఫ్ట్ ట్యాంక్ నుంచి ఫైర్ అయిన మిసైల్ కంటే పవర్ ఫుల్‌గా ఉంది’’
‘‘టెంపర్ గురించి నా ట్వీట్లను చూసి తారక్‌తో నేను సినిమా చేయాలనుకుంటున్నానేమో అని జనాలు అనుకుంటున్నారు. కానీ జగన్ తారక్‌లోని టెంపర్‌ను బయటికి తీసినట్లు చేసేంత కెపాసిటీ నాకు లేదు’’

‘‘టెంపర్‌లో తారక్ పెర్ఫామెన్స్ చూసిన తర్వాత నాకు అర్థమైంది.. తనతో సినిమా చేసే అర్హత నాకు లేదు అని’’



No comments:

Post a Comment

Contact Form

Name

Email *

Message *